Delhi Mayor Elections: ఢిల్లీ మేయర్ పీఠం కోసం నేతల మధ్య పోటీ..

Delhi Mayor Elections: ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. మేయర్ ఎన్నిక విషయంలో రెండు పార్టీల మధ్య తోపులాటకు దారితీసింది. సివిక్ సెంటర్ మధ్యలో ఆప్, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొందరు నేలమీద పడిపోయారు..ఆప్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ అనేక అపాయింట్‌మెంట్లు చేశారని, మేయర్ ఎన్నికలను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.
మేయర్ పోల్స్‌లో హై డ్రామా నెలకొనడంతో ఇరు పార్టీల మధ్య తోపులాటకు దారి తీసింది. తోపులాటలో మైక్‌లు విరిగాయి. దీంతో ఆప్ నేతల నిరసన చేపట్టారు. మరోవైపు ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఓటమిపాలైనప్పటికీ.. మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్ బార్గీలు పోటీ పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com