వారి ఫొటోలు తొలగించవద్దు.. స్టాలిన్‌ ఆసక్తికర నిర్ణయం..!

వారి ఫొటోలు తొలగించవద్దు.. స్టాలిన్‌ ఆసక్తికర నిర్ణయం..!
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారం చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారం చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే హయాంలో పాఠశాలలకు వెళ్లే పిల్లలకు 65 లక్షల బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపుగా రూ 13 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఇప్పుడు కరోనా తరువాత స్కూళ్ల ప్రారంభం సమయంలో ఆ బ్యాగులను పంపిణీ చేయాలా వద్దా..అనే సందేహం అధికారుల్లో మొదలైంది.

ఆ బ్యాగులపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి చిత్రాలు ముద్రించారు. స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో వారు ప్రభుత్వానికి విషయాన్ని నివేదించారు. 65 లక్షల బ్యాగులను ఎటువంటి మర్పులు అవసరం లేదని..వారి ఫొటోలు ఉన్నంత మాత్రాన తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పేసారు. దీని కోసం రూ 13 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం కావటానికి వీళ్లేదని అధికారులకు స్పష్టం చేసారు.

ఆ బ్యాగులనే పిల్లలకు ఇవ్వాలని ఆదేశించారు. జయలలిత నుంచి పళనిస్వామి ఉన్న ఫోటోలతో ఉన్న బ్యాగులనే పిల్లలు ఇవ్వాలని సూచించారు.ఫోటోలను మార్చడం ద్వారా ప్రభుత్వ ధనం వృధా అవుతుందని వెల్లడించారు. ఫోటోలకు వెచ్చించే డబ్బును ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాలని సూచించారు.

మరోవైపు ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీ అధినేతల్ని పొగడ్తలతో ముంచెత్తి తమ ఉనికి చాటుకోవడం ద్రవిడ రాజకీయాల లక్షణమని, వరకు ఇదే పద్దతి కొనసాగిందని స్టాలిన్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

Tags

Read MoreRead Less
Next Story