Earthquake: సిక్కింలో భూకంపం

Earthquake: సిక్కింలో భూకంపం
సోమవారం ఉదయం 4గంటల 15నిమిషాలకు యుక్సోమ్‌ ప్రాంతంలో కంపించిన భూమి , భయాందోళనతో పరుగులు తీసిన జనం

సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 4గంటల 15నిమిషాలకు యుక్సోమ్‌ ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుండి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఏక్షణాన ఏం జరుగుతోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదయ్యింది. యుక్సోమ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story