Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగార

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడానికి ఫిబ్రవరి 23 ఆఖరు తేదీగా నిర్ణయించారు. మార్చి 13న పోలింగ్ జరగనుండగా మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు ఉండగా తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com