జాతీయం

Assam: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్నాక అసలు విషయం తెలిసి..

Assam: మేఘనగా మారువేషంలో వచ్చి అలోక్‌ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు అవాక్కయ్యారు.

Assam: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్నాక అసలు విషయం తెలిసి..
X

Odisha: మేఘనగా మారువేషంలో వచ్చి అలోక్‌ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు అవాక్కయ్యారు. గ్రామస్తులు మేఘనాద జుట్టును కత్తిరించి పురుషు దుస్తులు ధరించేలా చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన అలోక్ కుమార్, రామ్‌నగర్ గ్రామానికి చెందిన బిషవ్‌నాథ్ మండల్ కుమార్తె మేఘనతో ఫేస్‌బుక్‌లో పరిచయం స్నేహంగా మారింది.

వారి పరిచయం ప్రేమగా మారింది. ఒకరికొకరు ఫోటోలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. మేఘనను ఇంట్లో వాళ్లకు పరిచయం చేశాడు అలోక్. వాళ్లు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారు.

అలోక్ మేనమామ దగ్గరి వారిని ఆహ్వానించి పార్టీ కూడా ఇచ్చాడు. అందరూ విందును ఆస్వాదిస్తున్న సమయంలో, బినోబాబాబేనగర్‌కు చెందిన సుజాత నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చింది. మేఘన అమ్మాయి కాదు అబ్బాయి అని గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె అలోక్‌కి, అతని మామకు తెలియజేసింది.

విషయం తెలుసుకున్న అలోక్ మామ మేఘన తల్లిదండ్రులను తన ఇంటికి రమ్మని అడిగాడు. కానీ వాళ్లు రాకపోవడంతో అలోక్ బంధువులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరుసటి రోజు, గ్రామస్థులు అతడి జుట్టును కత్తిరించి, పురుషుల దుస్తులు ధరించేలా చేశారు.

మేఘనాద్ గతంలో కూడా ఇలాగే చాలా మంది యువకులను మోసం చేశాడని తెలుసుకున్నారు. మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే పోలీసులకు అప్పజెబుతాం అని నాలుగు తగిలించి వదిలేశారు.

Next Story

RELATED STORIES