Final Exams Canceled: ఈసారి కూడా 'పది' పరీక్షల్లేవ్.. అంతా పాస్

Final Exams Canceled:
Final Exams Canceled:తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉండి దేశమంతా లాక్డౌన్ లోకి వెళ్లి పోయింది. ఇట్లాంటి తరుణంలో విద్యార్థుల పబ్లిక్ పరీక్షలన్నింటిని రద్దు చేశాయి దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ ఏడాది కూడా కరోనా భయంతో ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమయ్యారు విద్యార్థులు. పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నం కావడంతో కొన్ని స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే అక్కడక్కడా కొన్ని కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో అధికారుల్లో మళ్లీ భయం పట్టుకుంది. దీంతో ఈ ఏడాది కూడా తొమ్మిది, పది, పదకొండు తరగతి కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరాదని అందరినీ పై క్లాసులకు ప్రమోట్ చేయాలని తమిళనాడు సిఎం పళనిస్వామి పేర్కొన్నారు.
కాగా, పదవీ విరమణ వయస్సును కూడా 59 నుండి 60 సంవత్సరాలకు పెంచవచ్చని ముఖ్యమంత్రి పళని స్వామి సమావేశంలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com