కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 76 మంది కరోనా రోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబైలోని కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 76 మంది కరోనా రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

భాందుప్ లోని షాపింగ్ మాల్ ను అధికారులు కరోనా ఆస్పత్రిగా మార్చారు. మాల్ లో మూడో అంతస్తులో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు.


Tags

Next Story