PM Kisan Samman Nidhi Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..!

PM Kisan Samman Nidhi Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..!
X
PM Kisan Samman Nidhi Yojana : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా 10వ విడతలో పెట్టుబడి సాయాన్ని జనవరి 1న విడుదల చేయనున్నట్లు పీఎంవో ప్రకటించింది.

PM Kisan Samman Nidhi Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా 10వ విడతలో పెట్టుబడి సాయాన్ని జనవరి 1న విడుదల చేయనున్నట్లు పీఎంవో ప్రకటించింది. 10 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలకు మొత్తం కలిపి 20 వేల కోట్ల రూపాయలు బదిలీ చేయనున్న ట్లు తెలిపింది. లబ్ధిదారులకు కేంద్రం పీఎం-కిసాన్‌ పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు ఇస్తుంది. అలాగే దేశంలోని 351 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రధాని మోదీ 14 కోట్ల ఈక్విటీ మంజూరు చేస్తారని పీఎంవో పేర్కొంది. ఈ సందర్భంగా జనవరి 1న ఎఫ్‌పీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడతారని తెలిపింది.

Tags

Next Story