zero rupee note : మన దేశంలో సున్నా రూపాయి నోటు కూడా .. ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

zero rupee note : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 1 నుండి రూ. 2 వేల వరకు నోట్లను ముద్రిస్తుందని అందరికీ తెలుసు... ఈ నోట్ల ద్వారా ప్రజలు తమ రోజువారీ అవసరాలను పొందుతారు. అయితే మన దేశంలో సున్నా రూపాయి నోటు కూడా ఉందనే విషయం మీకు తెలుసా? ఈ సున్నా రూపాయి నోటుపై కూడా జాతిపిత మహాత్మాగాంధీ ఫోటో కూడా ముద్రించబడి ఉంటుంది.. సున్నా రూపాయి నోటు పాత 50 రూపాయల నోటును పోలి ఉంటుంది మరియు సాధారణ నోటు కంటే కొంచం పెద్దదిగా ఉంటుంది.
అయితే సున్నా రూపాయి నోటును ఎందుకు ఆర్బీఐ జారీ చేసింది.. దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుత్తానికి అయితే ఈ సున్నా నోటు చలామణిలో లేదు.. ఈ నోటు అనేది ఆర్‌బిఐ సావరిన్ గ్యారెంటీని కలిగి ఉండే నోటు కాదు అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు 2007లో చెన్నైకి చెందిన 5వ పిల్లర్ అనే ఎన్‌జిఓ ఈ నోట్లను ముద్రించింది.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్ ప్లేస్‌లు, పలు పబ్లిక్ ప్లేస్‌లలో 5వ పిల్లర్ వాలంటీర్లు జీరో రూపాయి నోట్లను పంపిణీ చేసేవారు. లంచం ఇవ్వకూడదు.. తీసుకోకూడదు అనే అంశంపైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ జీరో రూపాయి నోట్లను వారు విస్తృతంగా పంపిణీ చేసేవారు. ఎవరైనా లంచం అడిగితే వారికి ఈ నోటు ఇవ్వండి.. తర్వాత మాకు ఫిర్యాదు చేయండనే కాన్సెప్ట్‌తో 5వ పిల్లర్ ఎన్‌జిఓ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.
గత 5 సంవత్సరాలలో 1200 కంటే ఎక్కువ పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాలకు వీరు వెళ్లారు.30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండే భారీ సైజ్ జీరో రూపాయి నోట్ బ్యానర్‌పై విద్యార్థులు, ప్రజలతో సంతకాలు సేకరించారు. జీరో రూపాయి నోటు కింద.. "నేను లంచం తీసుకోను.. లంచం ఇవ్వను" అనే క్యాప్షన్ ఉంటుంది. ఇందుకు ఆమోదం తెలుపుతూ 5 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు.
ఆ విధంగా జీరో నోట్ బాగా పాపులర్ అయింది. కాగా ఈ జీరో నోట్ హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం మరియు తమిళం భాషలలో అందుబాటులో ఉన్నాయి. www.5thpillar.org నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com