రోజురోజుకూ క్షీణిస్తున్న ప్రణబ్ ఆరోగ్యం

రోజురోజుకూ క్షీణిస్తున్న ప్రణబ్ ఆరోగ్యం
X
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం రోజురోజుకు ఆందోళనకరంగా మారుతుంది.

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం రోజురోజుకు ఆందోళనకరంగా మారుతుంది. సోమవారం ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేసిన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన సెప్టిక్ షాక్‌లో ఉన్నారని వైద్యులు అన్నారు. ప్రసుత్తం ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిపుణులైన వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

Tags

Next Story