Heavy Rains: పొంగి ప్రవహిస్తున్న గోదావరి.. నీట మునిగిన ఆలయాలు..

Heavy Rains: పొంగి ప్రవహిస్తున్న గోదావరి.. నీట మునిగిన ఆలయాలు..
X
Heavy Rains: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగి ప్రవహించడంతో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆలయాలు నీట మునిగాయి.

Heavy Rains: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగి ప్రవహించడంతో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆలయాలు నీట మునిగాయి. డ్యామ్‌లో నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక నదుల నీటి మట్టాలు పెరగాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న పలు ఆలయాలు నీట మునిగాయని అధికారులు తెలిపారు.

"నాసిక్ నివాసితులు నది ఒడ్డున ఉన్న దూతోండ్య మారుతి విగ్రహం చుట్టూ నీటి మట్టాన్ని చూడటం ద్వారా వరద తీవ్రతను కొలుస్తారు. ప్రస్తుతం, నీటి మట్టం విగ్రహం నడుము కంటే కొంచెం దిగువన ఉంది," అని ఒక అధికారి వివరించారు.

ప్రస్తుతం నీటి మట్టం 'ప్రమాద' స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story