Heeraben Modi Death: ప్రధాని మోదీకి సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ

ప్రధాని మోదీకి సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపాలు తెలిపారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో పాటు, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి అమిత్ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. హీరాబెన్ మరణ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని, ఎంతో బాధాకరమని రాహుల్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ప్రధానికి తన సానుభూతి, ప్రేమ తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి పార్ధివ దేహాం పాడెను మోశారు. ఈ అంతిమయాత్రలో పాల్గొనేందుకు మోదీ సన్నిహితులకు మాత్రమే అనుమతించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com