Uddhav Thackeray : దమ్ముంటే తనను జైల్లో పెట్టాలంటూ సవాల్‌ విసిరిన ఉద్ధవ్‌ థాక్రే..!

Uddhav Thackeray : దమ్ముంటే తనను జైల్లో పెట్టాలంటూ సవాల్‌ విసిరిన ఉద్ధవ్‌ థాక్రే..!
Uddhav Thackeray : మహారాష్ట్రలో శివసేనను..బీజేపీ టార్గెట్‌ చేసిందా? వరుస ఈడీ,ఐటీ దాడులతో సీఎం ఉద్ధవ్‌ థాక్రేను ముప్పు తిప్పలు పెడుతోందా? అంటే అవునేని సమాధానం వస్తోంది.

Uddhav Thackeray : మహారాష్ట్రలో శివసేనను..బీజేపీ టార్గెట్‌ చేసిందా? వరుస ఈడీ,ఐటీ దాడులతో సీఎం ఉద్ధవ్‌ థాక్రేను ముప్పు తిప్పలు పెడుతోందా? అంటే అవునేని సమాధానం వస్తోంది. వరుస ఈడీ దాడులతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం ఉద్దవ్ థాక్రే సతీమణి రష్మీ సోదరుడు శ్రీధర్ మధవ్ పటాంకర్ పై ఈడీ సోదాలు జరిపి 6.45 కోట్లను సీజ్ చేసింది. మరోవైపు మంత్రి ఆదిత్య ఠాక్రేకు సన్నిహితులపై ఇళ్లపైనా ఐటీ దాడులు జరిగాయి.

దీంతో బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు సీఎం ఉద్ధవ్‌ థాక్రే. తమ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ నేతలతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్‌ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి బీజేపీ నీచరాజకీయాలకు దిగిందంటున్నారు ఉద్ధవ్‌. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలంటూ సవాల్‌ విసిరారు ఉద్ధవ్‌.

గత కొంతకాలంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మర సోదాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అంతకుముందు ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కూడా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి, ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీశాఖ దాడులు కొనసాగించింది. ఇప్పుడు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ సోదరుడు శ్రీధర్‌ మధవ్‌ పటాంకర్‌పైనా ఈడీ సోదాలు జరిపింది. దీంతో సీఎం ఉద్ధవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటు బీజేపీ మాత్రం.. తప్పు చేసినవారిని వదిలే ప్రసక్తేలేదంటోంది. దీనికి సీఎం ఉద్ధవ్‌ ఎందుకు కంగారు పరడుతున్నారంటూ ఎద్దవా చేస్తున్నారు బీజేపీ నేతలు. అధికారం కోసం... నీచ రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం లేదంటున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి.. ఈ విషయంలో... బీజేపీ దూకుడగా వ్యవహరిస్తుండగా అటు సంకీర్ణ సర్కారు మాత్రం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story