Ajit Pawar: అజిత్ పవార్‌కు ఐటీ షాక్.. 1400 కోట్లు..

Ajit Pawar (tv5news.in)
X

Ajit Pawar (tv5news.in)

Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, NCP సీనియర్ లీడర్ అజిత్ పవార్ కు షాకిచ్చింది ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్.

Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, NCP సీనియర్ లీడర్ అజిత్ పవార్ కు షాకిచ్చింది ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన 1400 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టెంపరెరీగా సీజ్ చేసింది. గతనెల 7న దేశవ్యాప్తంగా పవార్ కుటుంబ సభ్యులు, బంధువుల ఆస్తులపై తనిఖీలు చేసింది ఐటీ.

విస్తృత తనీఖీల తర్వాత అదేనెల 15న.. ఆయన బంధువులకు చెందిన రెండు స్తిరాస్థి గ్రూపుల్లో 184 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడ్డట్లు వెల్లడించారు అధికారులు. తాజాగా 1400 కోట్ల ఆస్తుల్ని జప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ఆస్తులతో తమ పార్టీనేత అజిత్ పవార్ కు సంబంధం లేదన్నారు మంత్రి నవాబ్ మాలిక్.

Tags

Next Story