త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానున్న స్పుత్నిక్ వి టీకా .. !

త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానున్న స్పుత్నిక్ వి టీకా .. !
భారత్‌లో త్వరలో స్పుత్నిక్ వి టీకా అందుబాటులోకి రానుంది. స్పుత్నిక్ వి టీకాకు కేంద్రం ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిని ఇచ్చింది.

భారత్‌లో త్వరలో స్పుత్నిక్ వి టీకా అందుబాటులోకి రానుంది. స్పుత్నిక్ వి టీకాకు కేంద్రం ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిని ఇచ్చింది. దీంతో భారత్‌లో ఆమోదం పొందిన మూడో కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నికే. ఈ వ్యాక్సిన్ రష్యాలో తయారైంది.

దీని సమర్థత 95 శాతంగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక రష్యాకు చెందిన DIF భారత్‌లో స్పుత్నిక్ వి ఉత్పత్తికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. డీసీజీఐ అనుమతి రావడమే ఆలస్యం టీకా ఉత్పత్తి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే ప్రకటించింది.

మన దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వినియోగంలో ఉన్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ రెండు వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టీకా కూడా వస్తే కరోనా చాలా వరకు అదుపులోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story