India Omicron : లైట్ తీసుకోవద్దు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

India Omicron :  లైట్ తీసుకోవద్దు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌  కేసులు
India Omicron : ప్రపంచ దేశాల్లో దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌... ఇప్పుడు దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.

India Omicron : ప్రపంచ దేశాల్లో దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌... ఇప్పుడు దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 32 కేసులు నమోదు కాగా... మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మహారాష్ట్ర నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17కి పెరిగింది. నాలుగు కేసులు పింప్రి చించల్‌వాడ్ నగరంలో నమోదు కాగా... మరో మూడు ముంబైలో బయటపడ్డాయి. పింప్రిచించల్‌వాడ్ బాధితులు ఓ నైజీరియా మహిళను కలవడంతో వైరస్ సోకగా, మిగతా ముగ్గురికి టాంజానియా, యూకే, సౌతాఫ్రికా ప్రయాణ చరిత్ర ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే బాధితుల్లో నలుగురికి వ్యాక్సినేషన్ కూడా పూర్తయిందని, ఒకరు సింగిల్ డోసు మాత్రమే వేసుకోగా, మరొకరు అసలే తీసుకోలేదని పేర్కొన్నారు. టీకా తీసుకునేందుకు అర్హత లేని మూడున్నరేళ్ల చిన్నారి కూడా బాధితుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నలుగురిలో ఎలాంటి లక్షణాలు లేవని, ముగ్గురిలో మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు

Tags

Read MoreRead Less
Next Story