India Corona : కరోనాతో మరో వేయి మంది మృతి ..!

India Corona : కరోనాతో మరో వేయి మంది మృతి ..!
India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,49,394మందికి కరోనా సోకింది.

India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,49,394మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే 13% తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో 2,46,674 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 4,00,17,088కి చేరుకుంది. అటు కరోనాతో మరో 1,072 మంది మరణించారు. కాగా ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివివిటీ రేటు 9.27%గా ఉంది. నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో 42,677 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 16,436 కేసులు, మహారాష్ట్రలో 15,252 కేసులు, తమిళనాడులో 11,993 కేసులు, రాజస్థాన్‌లో 8,073 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 60 శాతానికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Next Story