Coronavirus India : అదుపులోకి కరోనా.. కొత్తగా కేసులు ఎన్నంటే..!

Coronavirus India :  అదుపులోకి కరోనా.. కొత్తగా కేసులు ఎన్నంటే..!
Coronavirus India : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50శాతం ఎక్కువగా ఉంది

Coronavirus India : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50శాతం ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,467 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24కోట్లకు చేరింది. మరోవైపు 39,486 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది. అటు గడిచిన 24 గంటల్లో 354 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 4,35,110కి చేరింది. ప్రస్తుతం 3.19 లక్షలు యాక్టివ్ కేసులున్నాయి. కాగా కేరళలో అత్యధిక కేసులు 13,383, మహారాష్ట్రలో 3,643 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story