జాతీయం

India corona : ఆగని కరోనా విజృంభణ.. గడిచిన 24 గంటల్లో 315 మంది మృతి..!

India corona : దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 68 వేల మంది కరోనా బారిన పడ్డారు.

India corona : ఆగని కరోనా విజృంభణ..  గడిచిన 24 గంటల్లో 315 మంది మృతి..!
X

India corona : దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 68 వేల మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 6 వేలు దాటింది. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14 లక్షల 17 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 43 వేల కేసులు నమోదు కాగా....కర్ణాటకలో 28 వేలు, ఢిల్లీలో 24 వేలకు పైగా మంది కరోనా బారినపడ్డారు. తమిళనాడులో 23 వేలు, బెంగాల్‌లో 22 వేలు, యూపీ, కేరళల్లో 16 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్‌లో కొత్తగా పది వేల మంది వైరస్ బారిన పడ్డారు.

Next Story

RELATED STORIES