Home
 / 
జాతీయం / India Corona : దేశంలో...

India Corona : దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు..!

India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

India Corona : దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు..!
X

India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 7.3 శాతం ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,30,98,743కి చేరుకుంది.

ఇదే సమయంలో 3,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక 22 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. కాగా ప్రస్తుతం దేశంలో 20,303 యాక్టివ్ కేసులున్నాయి.

ఢిల్లీలో అత్యధికంగా 1,656 కేసులు నమొదు కాగా, హర్యానాలో 582 కేసులు, కేరళలో 400 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 320 కేసులు, మహారాష్ట్రలో 205 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Next Story