జాతీయం

COVID vaccine : టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు..!

టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది.

COVID vaccine  : టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు..!
X

టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కు కేంద్రం శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, అదే మోదీకి ఇచ్చే అసలైన కానుక అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. దీంతో టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగింది. 8లక్షల మంది వాలంటీర్లతో భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారు.

సాయంత్రం 5 గంటల సమయానికి డోసుల పంపిణీ 2కోట్లు దాటింది. ఒక రోజులో రెండు కోట్లకు పైగా టీకాలను పంపిణీ చేయడంతో భారత్‌ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. వచ్చే నెల నాటికి కేంద్రం 100కోట్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ఇరవై ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా సేవా సమర్పణ అభియాన్ పేరుతో 20 రోజులపాటు ఈ మెగా వ్యాక్సినేషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

అటు శనివారం ప్రధాని గోవా హెల్త్‌కేర్ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు. గోవాలో వయోజనుల్లోనూటికి నూరు శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోవడం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 79కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయింది. అక్టోబర్ నాటికి 100కోట్ల డోసుల టీకాకరణ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story

RELATED STORIES