Indian Army : జవాన్ పెళ్లి కోసం స్పెషల్ హెలికాప్టర్..!

Indian Army : ఓ జవాన్ పెళ్లి కోసం ప్రత్యేక హెలికాప్టర్ ని నియమించింది ఇండియన్ ఆర్మీ.. జమ్మూకాశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న 30 ఏళ్ల నారాయణ బెహరా (ఒడిశా) అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి కుదిరింది. మే 02న అతని పెళ్లి జరగనుంది.
అయితే అతను ఇంటికి వెళ్ళాలంటే అతను విధులు నిర్వహిస్తున్న ప్రదేశం మొత్తం మంచుతో నిండిపోవడంతో రోడ్డు మార్గం క్లోజ్ అయింది. అతను ఇంటికి చేరాలంటే 2,500 కిలోమీటర్ల ప్రయాణించాలి.. పెళ్లికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న అతని తల్లిదండ్రులు కొడుకు సమయానికి వస్తాడో రాడో అని ఆందోళన చెందారు.
ఇదే విషయం పైన ఆర్మీ ఉన్నతాధికారులకు వివరించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ అతనికోసం స్పెషల్ గా చిరుత హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. అక్కడినుంచి అతన్ని స్వగ్రామానికి పంపారు.
జవాన్ల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఓ సైనికుడి కోసం ఆర్మీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్తువెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com