Gaganyaan : ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో ముందడుగు

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గన్‌యాన్ ప్రాజెక్టులో మరో అడుగుముందుకు పడింది. గన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం క్రయోజెనిక్ ఇంజిన్ అర్హత పరీక్షను ఇస్రో సక్సెస్‌గా నిర్వహించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో.. 720 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించి..ఇంజిన్ పనితీరును పరిశీలించింది.
ఇప్పటికే ఇంజిన్ పనితీరు... పరీక్ష లక్ష్యాలను చేరుకుందని ఇంజిన్ పారామితులు మొత్తం వ్యవధిలో అంచనాలకు దగ్గరగా సరిపోలుతున్నాయని ఇస్రో వెల్లడించింది. విజయవంతమైన ఈ దీర్ఘకాల పరీక్ష... గగన్‌యాన్ ప్రాజెక్టులో కీలకఘట్టంగా నిలుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రయోజెనిక్ ఇంజిన్సుమారు 1810 సెకన్ల పాటు జరిగే మరో నాలుగు పరీక్షలను ఎదుర్కోనుందని ఇస్రో తెలిపింది. గగన్‌యాన్ కోసం క్రయోజెనిక్ ఇంజన్ అర్హతను పూర్తి చేయడానికి.. మరో ఇంజన్‌కు ఓ దీర్ఘకాలిక, రెండు స్వల్పకాలిక పరీక్షలను నిర్వహించనున్నట్టుగా పేర్కొంది.
అటు ఇప్పటికే గగన్‌యాన్ ప్రాజెక్టు డిజైన్ ప్రక్రియ పూర్తై...పరీక్షల దశలోకి ప్రవేశించామని ఇస్రో ఛైర్మన్శివన్ తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022, ఆగస్టు 15లోపే మానవ రహిత గగన్‌యాన్ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ స్పష్టంచేశారు. గడువులోపే లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రతిఒక్కరు నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com