కరోనాతో కర్నాటక ఎంపీ మృతి

X
By - shanmukha |17 Sept 2020 7:27 PM IST
ఇటీవల కర్నాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..
ఇటీవల కర్నాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ రోజు కరోనాతో బీజేపీ ఎంపీ మృతి చెందారు. రాయ్‌చూర్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గాస్టి కరోనా చికిత్స పొందుతూ బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా 15 రోజుల క్రితం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ఎంపీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా సంతాపం తెలుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com