కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన

ప్రపంచం మొత్తం కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో పడింది. దాదాపు 30 కరోనా వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయని కేంద్ర సాంకేతక మంత్రిత్వశాఖ తెలిపింది.3 వ్యాక్సిన్లు ఫేజ్ 1,2,3 క్లినికల్ దశలో ఉన్నాయని.. వీటితోపాటు మరో నాలుగు వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని తెలిపారు. అయితే, కరోనా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ హెల్త్ కమ్యూనిటీ మెడిసిన్ శాఖకు చెందిన డాక్టర్ సంజయ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రైయల్స్ జరుగుతున్నాయని.. ఇప్పటికవరకూ 600 మందికి పైగా వాలంటీర్లపై ప్రయోగం జరిగిందని అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. లేకపోయినా.. 2021 మధ్య సమయం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ఒకవేళ ఆనాటికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే.. మాస్క్‌లు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి జాగ్రత్తలను మరింత జాగ్రత్తగా పాటించాలని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com