Garasia Tribe : నచ్చిన వ్యక్తితో సహజీవనం..పిల్లలు పుట్టాకే పెళ్లి..!

Garasia Tribe :  నచ్చిన వ్యక్తితో సహజీవనం..పిల్లలు పుట్టాకే పెళ్లి..!
Garasia Tribe : పెళ్లికి ముందే గర్భం దాల్చితే అబ్బాయి కంటే ముందు అమ్మాయి పైన బరితెగించిందన్న అనే నిందలు వేస్తుంది ఈ సమాజం.

Garasia Tribe : పెళ్లి అయ్యాక పిల్లల్ని కనడం మన దేశ సంస్కృతి.. పెళ్లికి ముందే గర్భం దాల్చితే అబ్బాయి కంటే ముందు అమ్మాయి పైన బరితెగించిందన్న అనే నిందలు వేస్తుంది ఈ సమాజం. కానీ ఇక్కడి తెగకి సంబంధించిన వారు మాత్రం ఇందుకు విరుద్దమని చెప్పాలి. అక్కడ స్త్రీలు తమకి నచ్చిన అబ్బాయిని ఇష్టపడి ఆ వ్యక్తితో సహజీవనం చేయొచ్చు.. పిల్లల్ని కనవచ్చు.. నచ్చితే అతడినే పెళ్లి చేసుకోవచ్చు.. లేదంటే విడిపోవచ్చు.. పెళ్లి కూడా ఆర్ధికంగా స్థిరపడ్డాకే చేసుకునే వెసులుబాటు ఈ తెగలో ఉంది.

అయితే ఇదేక్కడో వేరే దేశంలో అనుకుంటే పొరపాటే అవుతుంది. మనదేశంలోని తెగవారే వీరు.. ఆ తెగ పేరు 'గరాసియా తెగ' ... రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ తెగ విస్తరించి ఉంది. వీరి సంప్రదాయం ప్రకారం.. యుక్త వయసులోకి వచ్చిన అమ్మాయిలు.. తమకి నచ్చిన అబ్బాయిని ఎంచుకోవడానికి ఓ నిర్ణిత సమయం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ జాతర కూడా జరుపుతుంటారు. ఇందులో పెళ్లితో సంబంధం లేకుండా అతడితో సహజీవనం మొదలుపెడుతారు. అయితే ఇక్కడ ఓ కండిషన్ ఉంది.

అమ్మాయి మెచ్చిన అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి సహజీవనం మొదలుపెడుతారు. ఒకరకంగా ఇది ఎదురుకట్నం/కన్యాశుల్కంలా అన్నమాట.. భవిష్యత్తులో ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పెళ్లి టైంలో ఖర్చు అంతా అబ్బాయి కుటుంబానికి చెందిన వాళ్ళే భరిస్తారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని ఇక్కడి తెగ వారు చెబుతున్నారు.

ఈ పద్ధతిని వారు 'దాపా'గా పిలుస్తున్నారు. సహజీవనంలో ఉన్న సమయంలో భాగస్వామి ఏమైనా వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకుంటే ఆ బంధం నుంచి బయటికి వచ్చేలా అక్కడి మహిళలకి వెసులుబాటును కల్పించారు గరాసియా తెగ పూర్వీకులు. ఈ ఆచారాలే వల్ల కాలక్రమేణా వరకట్న వేధింపులు,అమ్మాయిలపై అత్యాచారాలు తగ్గాయని అక్కడి వారు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story