తమిళనాడులో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

తమిళనాడులో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు తమిళనాడు రాష్ట్ర సీఎం ఎడప్పాడి కె పళనిస్వామి ఆదివారం తెలిపారు.

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సర్కార్ లాక్‌డౌన్ విధించి అమలు చేస్తోంది. అయినా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు తమిళనాడు రాష్ట్ర సీఎం ఎడప్పాడి కె పళనిస్వామి ఆదివారం తెలిపారు. అయితే సడలింపు నిబంధనల ప్రకారం ఆదివారాల్లో పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని చెప్పారు. అన్ని ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రిసార్టులకు అనుమతిస్తున్నట్లు సీఎం పళనిస్వామి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4 మార్గదర్శకాలు, నిబంధనలను రాష్ట్ర ప్రజలు పాటించాలని పేర్కొన్నారు.

Tags

Next Story