Maharashtra : సుప్రియా సూలేకి బీజేపీ చీఫ్ క్షమాపణలు..!

Maharashtra : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పై చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ క్షమాపణలు చెప్పారు.. ఈ విషయాన్ని మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రుపాలి చకాంకర్ వెల్లడించారు. "రాజకీయాలు అర్ధం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకుపో" అంటూ సుప్రియా సూలే పై చంద్రకాంత్ కాంమెట్స్ చేయడంతో ఆయన పైన తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. దీనితో ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ విషయంలో చంద్రకాంత్ పాటిల్ విశాల హృదయాన్ని చూపించారని, అందుకే ఇంతటితో ఈ వ్యవహారానికి ప్రతిఒక్కరు ముగింపు పలకాలని సుప్రియా సూలే విజ్ఞప్తి చేశారు.
రాజకీయాల్లో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదనే అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చంద్రకాంత్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com