Anil Deshmukh Arrest: మనీలాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అరెస్ట్..

Anil Deshmukh Arrest: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆయన్ను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. మనీలాండరింగ్ అంశంలో అనిల్ దేశ్‌ముఖ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
దీనిపై అనిల్‌దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే ఇటీవల దేశ్‌ముఖ్ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించారు.
ఈ ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. మనీలాండరింగ్‌పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్ దేశ్‌ముఖ్ ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమనీ ఆయన పేర్కొన్నారు. అయితే అనిల్ దేశ్‌ముఖ్ లంచం ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com