Maharastra: ఉద్ధవ్ ఠాక్రేకు శరద్ పవార్ సలహా

ఏక్ నాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీ అని తేలింది. విల్లు, బాణం గుర్తూ షిండే వర్గానికి కేటాయించింది కేంద్ర ఎలక్షన్ కమిషన్. ఆరు నెలల వివాదం తర్వాత ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ విషయంపై ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. బీజేపీ ఏజెంట్ గా ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు.
ఉద్దవ్ ఠాక్రేను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కలిశారు. పార్టీ గుర్తును కోల్పోవడంపై చర్చించారు. కొత్త గుర్తు ఏదయినా దాన్ని అంగీకరించాలని ఠాక్రేకు శరద్ పవార్ సలహా ఇచ్చారు. గతంలో ఇందిరా గాంధీ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ కు జోడెద్దులతో కూడిన గుర్తు ఉండేదని... ఆతర్వాత ఇందిరా గాంధీ చేయి గుర్తును ఎంచుకున్నారని అన్నారు. కొత్త గుర్తును ప్రజలు ఆమోదిస్తారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com