Omicron Virus: మోదీ ఆధ్వర్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై సమీక్ష..

Omicron Virus: దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుపై రివ్యూ నిర్వహించారు ప్రధాని మోదీ. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. సమావేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు, వివిధ దేశాల్లో దాని ప్రభావంపై ప్రధాని మోదీకి వివరించారు అధికారులు. ఒమిక్రాన్‌తో భారత్‌కు వచ్చే ముప్పు అంశంపైనా సమావేశంలో చర్చించారు.
అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు ప్రధాని మోదీ. ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి గైడ్‌లైన్స్ ప్రకారం టెస్టులు, ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని. అంతర్జాతీయ ప్రయాణాలను సడలించే ప్రణాళికలపై రివ్యూ చేయాలని అధికారులకు సూచించారు ప్రధాని. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని జిల్లా, రాష్ట్ర యంత్రాంగాలను అప్రమత్తం చేయాలని సూచించారు.
కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు, ప్రత్యేక నిఘా ఉంటాలని సూచించారు. ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్..సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com