Narendra Singh Tomar : మళ్లీ సాగు చట్టాలను తీసుకొస్తాం : కేంద్రమంత్రి తోమర్

Narendra Singh Tomar : కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. "మేము వ్యవసాయ సవరణ చట్టాలను తీసుకువచ్చాము. అయితే కొంతమందికి ఈ చట్టాలు నచ్చలేదు. . అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం నిరుత్సాహపడడం లేదు..స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది పెద్ద సంస్కరణ.. దేశానికి రైతులే వెన్నెముక కాబట్టి వారికోసం ఒకడుగు వెనక్కి వేశాం" అని అన్నారు. సాగు చట్టాల రద్దు ప్రకటనతో ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు వారం క్రితమే శిబిరాలను ఖాళీ చేసి వెళ్లారు.తాజాగా మంత్రి మళ్ళీ వ్యవసాయ చట్టాలను తెస్తామని తోమర్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com