Mumbai : అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించిన పోలీసులు

Mumbai : అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించిన పోలీసులు


ముంబైలోని మహిమ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన దర్గాను పోలీసులు తొలగించారు. గురువారం ఉదయం భారీ బందోబస్తు మధ్య క్రిక్ లోని దర్గాను బుల్డోజర్ తో తొలగించారు. ఘటనా స్థలంలో పేరుకుపోయిన వాటిని ట్రక్కుల్లో తీసుకెళ్లారు.

మహరాష్ట్ర నవనిర్మాన్ సేన రాజ్ ఠాక్రే బుధవారం గుడి పడ్వా ప్రసంగంలో ముంబైలోని మహిమ్ ప్రాంతంలో అక్రమంగా దర్గా వచ్చిందని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితం దర్గా లేదని అన్నారు. అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించకపోతే అదే స్థలంలో తాము భారీ గణపతి ఆలయాన్ని నిర్మిస్తామని రాజ్ ఠాక్రే చెప్పారు. మహారాష్ట్రలో.. శివసేన - బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మహిమ్ సముద్రంలో మరో హాజీ అలీ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా వెలసిన దర్గాను పోలీసులు గురువారం తొలగించారు.

Tags

Next Story