24 గంటల్లో 3వేల కేసులు.. 305 బిల్డింగ్‌లు సీల్

24 గంటల్లో 3వేల కేసులు.. 305 బిల్డింగ్‌లు సీల్
గడిచిన ఏడాదంతా కరోనా కేసులతో ప్రపంచం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చి కోలుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

గడిచిన ఏడాదంతా కరోనా కేసులతో ప్రపంచం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం వ్యాక్సిన వచ్చి కోలుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది.

గడిచిన 2 గంటల్లో ఒక్క ముంబైలోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరింతగా విస్తరించే అవకాశం ఉన్నందున అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొత్తం 305 బిల్డింగ్‌లకు సీల్ వేశారు. ముంబైలో ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగి మార్చి 18 న 2,877 కేసులు నమోదు కాగా, మార్చి 19న 3,062 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story