Mysuru: ప్రధాని సోదరునికి తృటిలో తప్పిన ప్రమాదం
Mysuru

Mysuru: ప్రధాని సోదరునికి తృటిలో తప్పిన ప్రమాదం
భారత ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి పెను ప్రమాదం తప్పింది. కుటుంబం సహా మైసూరు నుంచి బండిపూరా వెళుతున్న ప్రహ్లాద్ కారు అదుపు తప్పడంతో ముందరి భాగం నుజ్జునుజ్జు అయింది.
ప్రమాద సమయంలో ప్రహ్లాద్ కుటుంబం మొత్తం కారులోనే ఉండగా, ఈ ఘటనలో అందరూ స్వల్పగాయాలతోనే బయట పడ్డారు. క్షతగాత్రులను మైసూరులోని ఆసుపత్రికి తరలించారు
ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు బయటకు రాగా, కారు ముందర భాగం శాంతం నుజ్జునుజ్జు అయిన వైనం తెలుస్తోంది. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదికి ప్రహ్లాద్ తమ్ముడుకాగా, వారి తల్లితండ్రుల ఆరుగురి సంతానంలో నాలుగో వాడు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైజ్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ కు ప్రహ్లాద్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com