16 Sep 2020 8:16 AM GMT

Home
 / 
జాతీయం / కోవిడ్ నుంచి...

కోవిడ్ నుంచి కోలుకున్నాక..: నాగబాబు

ఇటీవల తన కుమార్తె నిహారిక కొణిదెలతో కలిసి ఒక షో చేశారు.

కోవిడ్ నుంచి కోలుకున్నాక..: నాగబాబు
X

నటుడిగా, నిర్మాతగా, బుల్లి తెర హోస్ట్ గా పలు రంగాల్లో బిజీగా ఉండే మెగా బ్రదర్ నాగబాబు కోవిడ్ బారిన పడ్డానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వైద్యుల సలహా మేరకు గృహ నిర్భంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. టీవీ ఛానల్ లో ఓ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగ బాబు టీవీ షూట్స్ కోసం క్రమం తప్పకుండా పాల్గొనేవారు. ఇటీవల తన కుమార్తె నిహారిక కొణిదెలతో కలిసి ఒక షో చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన నాగబాబు.. వైరస్ వచ్చిందని బాధపడవలసిన అవసరం లేదు.. దాన్నుంచి కోలుకుని మరొకరికి సహాయపడవచ్చు. కరోనాని జయించి ప్లాస్మా దాతగా మారతాను అని నాగబాబు పేర్కొన్నారు.

Next Story