జాతీయం

Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మార్చిలో తాము సర్కారును ఏర్పాటు చేస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రంమంత్రి నారాయణ రాణే. ఎలా సాధ్యమని విలేకరులు ప్రశ్నించగా....... ప్రభుత్వాలు కూలగొట్టడం, ఏర్పాటు వంటివి రహస్యంగా జరుగుతాయన్నారు. బహిరంగంగా వీటిపై చర్చలు జరపరంటూ ఘాటుగా స్పందించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, NCP అధినేత శరద్‌ పవార్.. ఢిల్లీలోనే ఉండటం కేంద్రమంత్రి వ్యాఖ్యలకు మరింత బలాన్నిస్తున్నాయి.

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ తో కలిసి నిన్న ఢిల్లీ వెళ్లారు మాజీ సీఎం ఫడ్నవీస్. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి రాజాకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు NCP అధినేత శరద్‌ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్‌ పటేల్‌ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీరు కూడా బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

కేంద్రమంత్రి నారాయణ రాణే వ్యాఖ్యల్ని ఖండించారు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే. తమ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందన్నారు. శివ సేన-NCP-కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఇవాళ్టితో రెండేళ్లు పూర్తయ్యాయి. ఇంతలోనే కూటమి చీలి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్న వార్తలు సంచలనంగా మారాయి.

Next Story

RELATED STORIES