Narendra Modi: వాతావరణ మార్పుల నియంత్రణకు భారత్ కృషిచేస్తోంది: నరేంద్ర మోదీ

Narendra Modi (tv5news.in)
Narendra Modi: భారత్ 2070 సంవత్సరానికల్లా కర్బన ఉద్గారాల రహిత దేశంగా మారుతుందన్న ప్రధాని మోదీ. ఇందుకోసం తాము 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను చేరుకుంటాంమని ప్రకటించారు ప్రధాని మోదీ. సోమవారం స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగిన కాప్26 సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు.
2030 కల్లా నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని అందులో కీలకమైనది.. శిలాజేతర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడమన్నారు. ఈ చర్యల ద్వారా 2070 కల్లా కర్బన ఉద్ఘారాల విడుదల విషయంలో భారత్‌ను నెట్‌జీరో స్థాయికి తీసుకువస్తామని వివరించారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడంపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయని.. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని ఆయన అన్నారు.
కర్బన ఉద్గారాల విడుదల నియంత్రణకు కొన్ని శాశ్వత పరిష్కార పద్ధతులను అందిపుచ్చుకోవాలన్నారు. భారత్ మాత్రమే పారిస్ ఒప్పందాలను అమలు చేస్తూ వాతావరణ మార్పుల నియంత్రణకు కృషిచేస్తోందని చెప్పారు. పారిస్ ఒప్పందాల అమలుపై భారత్ మాత్రమే ఎక్కువగా దృష్టిపెట్టింది అనేకంటే.. 125 కోట్ల మంది భారతీయులంతా వారంతటవారే దాన్ని అమలు చేస్తున్నారనడం సమంజసమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com