Narendra Modi : ప్రధాని మోదీ కాన్వాయ్‌లోకి సరికొత్త కారు.. ఫీచర్లు ఏంటో తెలుసా?

Narendra Modi : ప్రధాని మోదీ కాన్వాయ్‌లోకి సరికొత్త కారు..   ఫీచర్లు ఏంటో తెలుసా?
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ వేసుకునే దుస్తులు, ఉపయోగించే వస్తువులపై ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది.

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ వేసుకునే దుస్తులు, ఉపయోగించే వస్తువులపై ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా ఆయన వాడుతున్న మెర్సిడెజ్ బెంజ్‌ మేబాష్‌ ఎస్‌ 650 కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ఒక్క రోజు భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు స్వాగతం పలకడానికి హైదరాబాద్‌ హౌస్‌కు వచ్చిన మోదీ తొలిసారి ఈ కారులో కనిపించారు. అలాగే, ఈ మధ్య మోదీ కాన్వాయ్‌లో మరోసారి ఈ వాహనం కనిపించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ కారు విలువ రూ.12 కోట్లకు పైనే ఉంటుందని అంచనా!

ఈ కొత్త కారులో అనేక స్పెషల్‌ ఫీచర్లు ఉన్నాయి. ఎస్‌-650 గార్డ్‌ కారు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంది మెర్సిడీస్‌. ఇది బుల్లెట్ల వర్షాన్ని తట్టుకోగలదు. ఏకె-47 రైఫిల్స్‌ దాడిని సైతం ఎదుర్కొంటుంది. గ్యాస్‌ దాడి జరిగినపుడు క్యాబిన్‌ నుండి ప్రత్యేకంగా గాలి కూడా విడుదలవుతుంది. ఈ కారుకు ఈవీఆర్‌ 2010 రేటింగ్‌ లభించింది. ఇది 2 మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్‌టీ పేలుడు శక్తిని నుంచి కాపాడుతుంది. కారు విండోస్‌కు పాలీకార్బొనేట్‌ ప్రొటెక్షన్‌ ఇస్తుంది.

కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనంలో అత్యంత శక్తివంతమైన 6.0 లీటర్‌ ట్విన్‌ టర్బో ఇంజిన్‌ అమర్చారు. ఇది 516 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 900ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను అందుకొంటుంది. భారీ ఇంజిన్‌ ఉన్నా.. కారు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకే పరిమితి చేశారు. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్లాట్‌ టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తోంది. ఈ కారు ఆయిల్ ట్యాంక్ ఒక ప్రత్యేక పదార్థంతో పూత పూశారు. వేడెక్కిన తర్వాత ఆటోమేటిక్‌గా రంధ్రాలను మూసివేస్తుంది. అపాచీ ట్యాంక్ విధ్వంసక హెలికాప్టర్‌ల తయారీకి ఉపయోగించే మెటల్‌నే దీనికి వినియోగించారు.

దేశ ప్రధానమంత్రి భద్రతకు బాధ్యత వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లేదా SPG శక్తివంతమైన కార్లను ఎంపిక చేస్తుంది. అన్ని భద్రతా సంబంధిత అవసరాలకు అనుగుణంగా ఈ ఎంపిక ఉంటుంది. తాము భద్రత కల్పిస్తున్న వ్యక్తికి కొత్త అవసరమా లేదా అనేది నిర్ణయిస్తుంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన కాన్వాయ్‌ బీఎండబ్ల్యూ7 సిరీస్ హై-సెక్యూరిటీ ఎడిషన్‌కి మారింది. ఆ తర్వాత ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్‌ కార్లను కూడా లో జోడించారు. ఇటీవల స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ప్రధాని భద్రతకు కొన్ని అవసరాలను గుర్తించింది. దీంతో ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగాంగానే రెండు ఎస్‌-650 గార్డ్‌ కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరోకారును ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం - డీకాయ్‌గా వినియోగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story