Narendra Modi: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ.. కలిసి అల్పాహారం..

Narendra Modi: తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం కానున్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం అల్పాహార విందుకు బీజేపీ ఎంపీలను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. కోవిడ్ పరిస్థితులు, సమస్యలపై ప్రధాని ఎంపీలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై మోదీ చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీ నేపథ్యంలో ఏపీకి చెందిన ముఖ్య నేతలు ఢిల్లీలో కేంద్రమంత్రి మురళీధర్ నివాసంలో సమావేశమయ్యారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ హాజరయ్యారు. రాష్ట్రానికి ఏఏ అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనే అంశాలపై కసరత్తు చేశారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్ని ఎలా విజయవంతం చేయాలి? ఎవరెవరిని ఆహ్వానించాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com