భారత ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు: నేపాల్ ప్రధాని

తమ దేశానికి కరోనా వాక్సిన్ ను సరఫరా చేసినందుకు గాను కృతజ్ఞతభావంగా ధన్యవాదాలు తెలిపారు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.. "కరోనా వ్యాక్సిన్ ద్వారా మహమ్మారిని కట్టడి చేసే అవకాశం వచ్చింది. ఇందుకు సహకరించిన మా పొరుగు దేశం భారత్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని కేపీ శర్మ వెల్లడించారు.
కాగా కరోనా మహమ్మారి నుంచి తమని తాము కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు కూడా సాయం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో జనవరి 20 నుంచి పొరుగు దేశాలకు వ్యాక్సిన్ పంపించే ప్రక్రియను భారత్ ప్రారంభించింది. ముందుగా భూటాన్, మాల్దీవులకు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశారు.
ఆ తర్వాత బాంగ్లాదేశ్, నేపాల్‌లకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని పంపించారు. ఈ నేపధ్యంలో కేపీ శర్మ ఓలి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక ఇదిలా ఉంటే గతంలో కరోనా తమకి భారత్ నుంచే వ్యాపించిందని ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com