మహారాష్ట్రలో మరో 161 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో మరో 161 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక పోలీస్ శాఖలో కరోనా కలవరం పెడుతోంది. ప్రతి రోజు వందల మంది కరోనా బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 161 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 14,953కు చేరింది.

మరోవైపు కరోనాకు చికిత్స పొందుతున్న వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ వల్ల మృతి చెందిన పోలీసుల సంఖ్య 154కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 11,999 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,800 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7.64 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 24 వేలకు పైగా మృతి చెందారు.

Tags

Next Story