కరోనాకి కొత్త మందుని కనిపెట్టిన మరో డాక్టర్.. మర్కెట్లోకి వచ్చింది

కరోనాకి కొత్త మందుని కనిపెట్టిన మరో డాక్టర్.. మర్కెట్లోకి వచ్చింది
అసలు కోవిడ్ కి ఇంత వరకు మందు కనిపెట్టలేదా అన్న అనుమానం. తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ డాక్టర్ కాక్‌టైల్‌ చికిత్సతో కోవిడ్ తగ్గిస్తానంటున్నారు.

అందరిలో నిరాసక్తత. ఇంకా ఎన్ని రోజులో ఈ బాధలు.. వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు కోవిడ్ కి ఇంత వరకు మందు కనిపెట్టలేదా అన్న అనుమానం. తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ డాక్టర్ కాక్‌టైల్‌ చికిత్సతో కోవిడ్ తగ్గిస్తానంటున్నారు.

హరియాణాకు చెందిన 82 ఏళ్ల కోవిడ్ బాధితుడికి రెండు రోజుల క్రితం తొలి డోస్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురుగ్రామ్ లో పేరుపొందిన మేదాంత హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నరేష్ థెహాన్ యాంటీబాడీ కాక్ టైల్ చికిత్స వివరాలను తెలియజేస్తున్నారు.

చికిత్సలో భాగంగా రెండు రకాల యాంటీబాడీలను కలిపి బాధితులకు ఇస్తారు. ఇవి వైరస్ కణాలను శరీరమంతటా వ్యాపించకుండా అడ్డుకుంటాయి. ఇది కరోనా రెండవ రకం వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేస్తుందని డాక్టర్లు అంటున్నారు.

ఈ చికిత్స ద్వారా రోగులు ఆస్పత్రికి వెళ్లే అవసరం 70 శాతం తగ్గిపోయిందని అంటున్నారు. కరోనా మహమ్మారిపై తిరుగుబాటుకు ఇది మన కొత్త ఆయుధం అని డాక్టర్ నరేష్ థెహాన్ పేర్కొన్నారు.

ఈ ఔషధానికి భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఈ యాంటీబాడీ కాక్ టైల్ ను ఇటీవల రోష్ ఇండియా, సిప్లా సంస్థలు సంయుక్తంగా భారత మార్కెట్ లోకి విడుదల చేశాయి. ఇక ఈ ఔషధం ఖరీదు డోస్ కు రూ. 59,750 రేటునిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story