కరోనా సెకండ్ వేవ్.. మరో షాకింగ్ విషయాన్ని తెలిపిన కేంద్రం

కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న వేళ.. కేంద్రం మరో షాకింగ్ విషయాన్ని తెలిపింది. దేశంలో కొత్త డబుల్ మ్యుటెంట్ స్ట్రేయిన్‌ను గుర్తించినట్లు ప్రకటించింది. దీంతో పాటు 771 కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపింది. వీటిలో 736 యూకే రకానికి చెందిన వైరస్ కేసులు, 34 సౌతాఫ్రికా రకానికి చెందిన కేసులు, ఒకటి బ్రెజిల్ రకానికి చెందిన వైరస్ ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ఈ కొత్త మ్యూటెంట్ వైరస్‌లే కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారి కేసులు 50వేలకు చేరువకు వస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న మరో 32వేల కేసులు తేలాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పండుగలు, ఉత్సవాల నిర్వహణను పరిమితం చేయాలని.. దేశంలో కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com