NIA: మూడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA: మూడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు
X
గతేడాది కోయంబత్తూర్‌, మంగళూరు నగరాల్లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు

దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐఎస్‌ఐఎస్‌ సానుభూతి పరుల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. గతేడాది కోయంబత్తూర్‌, మంగళూరు నగరాల్లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా 60 ప్రాంతాల్లోని ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు.

కోయంబత్తూర్‌ పేలుడులో జమీజా ముబీన్‌ మరణించడంతో అతనితో సంబంధాలున్న వారి గురించి ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుంది. కర్ణాటకలోని మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రెండు పేలుడు ఘటనలు ఉగ్రవాదులు చేశారని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Next Story