PM Modi : ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్

PM Modi : ప్రధాని మోదీని హత్యచేస్తామని బెదిరిస్తూ.... ఓ అగంతకుడు... జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్‌ఐఏకు మెయిల్ పంపించాడు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్‌ఐఏ ముంబై బ్రాంచ్‌కు ఈ మెయిల్ రావడంతో... భద్రతా సిబ్బంది అలర్టయ్యారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు 20 మంది స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నారని మెయిల్ పేర్కొన్నాడు అగంతకుడు.
ఇక వేలాది మందిని హత్య చేసేందుకు 20 కిలోల ఆర్‌డీఎక్స్ కూడా ఉన్నట్టు వెల్లడించాడు. స్లీపర్ సెల్స్‌తో టచ్‌లో ఉన్నానని, ఈ స్లీపర్ సెల్స్‌ను ఫిబ్రవరి 28న యాక్టివేట్ చేసినట్టు తెలిపాడు. తమకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఎన్‌ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది.
ప్రధాని మోదీని చంపుతామని బెదరిస్తూ ఎన్ఐఏకు మెయిల్ రావడం ఇది మొదటిసారి కాదు. 2018లోనూ పుణె పోలీసులకు వచ్చిన ఒక లేఖలో రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నామనే సమాచారం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com