omicron : దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

omicron : దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
omicron : దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9 వందలు దాటింది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9 వందలు దాటింది. మహారాష్ట్రలో పరిస్థితి క్రమంగా తీవ్రమవుతోంది. ఒక్క రోజే మహారాష్ట్రలో 85 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 252కు పెరిగింది. కొత్తగా వచ్చిన కేసుల్లో 53 కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేసింది మహారాష్ట్ర సర్కార్‌. యూఏఈ, దుబాయి నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది.

ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటకల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఒక్కరోజే 73 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 238కి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించింది ఢిల్లీ సర్కార్‌. సిటీ బస్సులను 50 శాతం కెపాసిటీతోనే నడుపుతున్నారు. మెట్రోలోనూ 50 శాతం ప్రయాణికులకే అనుమతించింది. దీంతో బస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

పంజాబ్‌లో ఫస్ట్ ఒమిక్రాన్ కేసు నమోదైంది. స్పెయిన్‌ నుంచి డిసెంబర్‌ 4న పంజాబ్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. ఐతే ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించేంత ఆందోళనకరంగా పరిస్థితులు లేవన్నారు అధికారులు. రాజస్థాన్‌లో మరో 23 మందికి ఒమిక్రాన్ సోకింది. దీంతో రాజస్థాన్‌లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 69కి పెరిగింది.

తమిళనాడులో కొత్తగా 11 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 45కు పెరిగింది. ఐతే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేరళ సరిహద్దు జిల్లా కోయంబత్తూరులో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కర్ణాటకలో కొత్తగా ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కాగా...బాధితుల సంఖ్య 43కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story