Omicron in India: చలితోకాదు.. ఒమిక్రాన్‌తో వణికిపోతున్న భారత్..

Omicron in India: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. వీరిలో ఇప్పటివరకూ 115 మంది రికవరీ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108 మంది ఒమక్రాన్ బారిన పడగా..వీరిలో 42 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తర్వాత ఢిల్లీలో 73, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. కేరళలో 37, తమిళనాడు 34, కర్ణాటకలో 31 మందిని ఒమిక్రాన్ బాధితులుగా గుర్తించారు. రాజస్థాన్‌లో 22 మందికి ఒమిక్రాన్ సోకింది. హర్యాణ,ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 4 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
జమ్ము కశ్మీర్, బెంగాల్, యూపీ, చంఢీఘర్, లఢఖ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ బాధితులను గుర్తించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com