మోదీ మాత్రమే మా దేశాన్ని రక్షించగలరు: కోల్‌కతాలో నివసిస్తున్న కాబూలీవాలాలు

మోదీ మాత్రమే మా దేశాన్ని రక్షించగలరు: కోల్‌కతాలో నివసిస్తున్న కాబూలీవాలాలు
భారతదేశంతో మాకు ఎక్కువ కాలం స్నేహం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఇప్పుడు మాకు సహాయం చేయగలరు" అని ఆఫ్ఘనిస్తాన్

పాకిస్తాన్ ఉద్దేశాలను మేము విశ్వసించము. మేము చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలపై కూడా ఆధారపడము. భారతదేశంతో మాకు ఎక్కువ కాలం స్నేహం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఇప్పుడు మాకు సహాయం చేయగలరు" అని ఆఫ్ఘనిస్తాన్ మూలానికి చెందిన వ్యాపారవేత్త జహీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆదివారం తాలిబాన్లు తమ దేశాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నందున కోల్‌కతాలో వ్యాపారం చేసుకుంటున్న అఫ్గానీ ముల్లిక్ బజార్ జాతీయ మీడియాకు చెప్పారు.

దాదాపు 25 సంవత్సరాల క్రితం తన తండ్రి భారతదేశానికి మకాం మార్చిన తర్వాత కోల్‌కతాలో నివసిస్తున్న జాహిర్ ఖాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. జైలుకైనా వెళ్తాను కానీ నేను తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రం వెళ్లను" అని జాహిర్ ఖాన్ అన్నారు.

కోల్‌కతాలో అనేక మంది ఆఫ్ఘన్‌లు నివసిస్తున్నారు. వీరిని 'కాబూలీవాలాస్' అని పిలుస్తారు. వారు 1840 లలో నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. 1892 లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'కాబూలీవాలా' అనే చిన్న కథ వీరి జీవన శైలికి అద్ధం పడుతుంది. వారు నగరంలో మనీ-లెండర్లు మరియు డ్రై ఫ్రూట్ విక్రేతలుగా జీవనం ప్రారంభించారు. కానీ వారిలో చాలా మందికి ఇప్పుడు బట్టల దుకాణాలు ఉన్నాయి.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆఫ్గన్లకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆఫ్గన్లు నమ్మడానికి సిద్ధంగా లేరు. "మేము భారతదేశ ప్రజలతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాము. ఈ స్నేహం మకింత బలోపేతం కావాలి. మేము భారతదేశాన్ని మా స్వంత దేశంగా భావిస్తున్నాము. ప్రధాని మోడీ ఇప్పుడు మాకు సహాయం చేయాలి. తరలింపు కోసం మరిన్ని విమానాలను పంపాలి" అని మరో ఆఫ్గన్ ఇబ్రహీం అన్నారు. ఏదేమైనా, ఇబ్రహీం ఖాన్ తాలిబన్లు మానవ హక్కులను కాపాడతామని ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story