జాతీయం

Corona Deaths : కరోనా వలన మన దేశంలో ఎంతమంది చనిపోయారంటే..?

Corona Deaths : చైనాలో పుట్టిన కరోనా మనదేశంలో మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు.. చాలా మంది ఆప్తులను కోల్పోయేలా చేసింది..

Corona Deaths : కరోనా వలన మన దేశంలో ఎంతమంది చనిపోయారంటే..?
X

Corona Deaths : చైనాలో పుట్టిన కరోనా మనదేశంలో మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు.. చాలా మంది ఆప్తులను కోల్పోయేలా చేసింది.. కొన్ని జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. మనదేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 5,23,693 మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని కేంద్రఆరోగ్యశాఖ తన అధికార వెబ్సైటులో పేర్కొంది.

CRS (పౌర నమోదు వ్యవస్థ) డేటా ప్రకారం ఏప్రిల్ 28, 2022 వరకు భారతదేశంలో మొత్తం 5,23,693 మరణాలు సంభవించాయి. 2020 సంవత్సరంలో 1,48,994 మంది మరణించగా, 2021 మరియు 2022లో వరుసగా 3,32,492 మరియు 42,207 మంది మరణించారు.

ఇక ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,568 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.. దీనితో ఆ సంఖ్య 4,30,84,913కి చేరుకుంది. అటు కొత్తగా మరో 20 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES